విజయవంతమైన క్రైస్తవ జీవితం అంటే ఏమిటి?
మనం దేవునిచే అంగీకరించబడ్డాము మరియు ప్రేమించబడ్డామని భరోసాకలిగిఉండడం
పరిశుద్ధాత్మ సన్నిధి అనుభవించడం
దేవుని మాట వినడం
మన విధిని నెరవేర్చడానికి విడుదల పొందుకోవటం
మన ప్రార్థనలకు జవాబును పొందుకోవటం
…ఇంకా మరెన్నో!!
ఈ వెబ్‌సైట్‌లో మన జీవితంలోని ఏవైనా ఇబ్బందుల నుండి విముక్తి కలిగించడానికి,మరియు మనల్ని యేసు దగ్గరికి తీసుకురావడానికి బోధన మరియు ప్రార్థనలు ఉన్నాయి.
వర్క్-బుక్
మన పాపాల నుండి మనలను విడిపించడానికి యేసు తన జీవితాన్ని ఇచ్చాడు. క్రీస్తు మన కొరకు సంపాదించిన విమోచనను మనలో చాలా మంది పొందుకోలేకపోతున్నారు. మన జీవితంలో ఇంకా ఏ విషయములో విడుదల పొందలేదో వాటిని గుర్తించడంలో ఈ వర్క్- బుక్ సహాయపడుతుంది. వివరణలు మరియు ఉదాహరణ ప్రార్థనల ద్వారా, మనం ఇంతకు ముందెన్నడూ పరిగణించని అనేక పశ్చాత్తాపం మరియు క్షమాపణ వంటి ముఖ్యాంశాలను ఇది బోధిస్తుంది.ప్రార్ధనపూర్వకముగా దానిని చదువుటద్వారా, ఈ కీలక విషయాలను మన జీవితాలకు అన్వయించుకోవచ్చు, విముక్తి పొందవచ్చు మరియు యేసయ్యకు ఇష్టమైన జీవితం జీవించడానికి శక్తిని పొందవచ్చు. అటు పిమ్మటఇతర వ్యక్తులను కూడా విడిపించుటలో సహాయపడడానికిసంసిద్ధులైవుంటాం.
‘ఒక విజయవంతమైన క్రైస్తవ జీవితం’ అనే వర్క్‌బుక్ ఈ వెబ్‌సైట్ నుండి ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ, కన్నడ, లుగాండా, మలయాళం, తెలుగు మరియు తమిళ భాషలలో ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంది.
